

మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి, ఇమ్రోస్, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.