ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలోని రాజ రాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం క్రిస్మస్ వేడుకలు సందర్భంగా కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమస్త అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు..తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే గారు చెప్పారు.విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు.సమాజ నిర్మాణంలో ఆదర్శవంతులుగా, విద్యార్థినీ విద్యార్థులను ఒక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలబడ్డారని అన్నారు.ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రమంతా నిర్వహిస్తోందని గుర్తుచేశారు.దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు