

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ).బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి పిడుగు పాటుతో చనిపోగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి కార్యకర్త కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ ఆపదలో ఆదుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు దేవేందర్ రెడ్డి, సుభాష్, సాయిలు పాల్గొన్నారు.