జనవరి 1, 2025 న థియేటర్ల లో రీ రిలీజ్ కి రెడీ అయిన రాజమౌళి, నితిన్ బ్లాక్ బస్టర్ మూవీ “సై” !!

మన న్యూస్:- టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ సై. ఈ చిత్రం 2004 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం ను సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మెగా ప్రొడక్షన్స్ వారు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న థియేటర్స్ లో భారిగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం లో జెనీలియా హీరోయిన్ గా నటించింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ‘సై’ చిత్రాన్ని 4కే అల్ట్రా హెచ్‌డీ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. లేటెస్ట్ సౌండ్ సిస్టంతో క్వాలిటీ అద్భుతంగా ఉండబోతుంది. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమాకు ఎం రత్నం డైలాగ్స్ అందించారు. ఎ భారతి నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమా కథ మొత్తం రగ్బీ ఆట చుట్టూ, ఒక కాలేజ్‌ లోని రెండు గ్రూప్‌ లు, ఒక విలన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తమ కాలేజ్ స్థలంను కబ్జా చేసేందుకు ప్రయత్నించే విలన్‌ తో రగ్బీ ఆటకు హీరో టీం దిగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది క్లైమాక్స్ లో దర్శకుడు జక్కన్న అద్భుతంగా చూపించాడు. రీ రిలీజ్ లోనూ ‘సై’ కచ్చితంగా హిట్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకులు, నితిన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల నితిన్ ఇష్క్ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.

  • Related Posts

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ “నరివెట్ట” సినిమా చూస్తూ ఎమోషనల్ అయిన ఆడియన్స్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరో టొవినో థామస్ !!!

    Mana News :- మలయాళ హీర టొవినో థామస్ నటించిన లేటెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళం లో విడుదలై మంచి విజయం సాధించింది, టొవినో నటనకు ప్రసంశలు వస్తున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

    చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్