పెద్ద సినిమాలకు బెన్ ఫిట్ షోస్, టికెట్ ధరల పెంపు రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – తెలంగాణ ఫిలింఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్

మన న్యూస్ :- పెద్ద సినిమాలకు ఇకపై బెన్ ఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్ పెంపు ఉండదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టాలీవుడ్ లో చిన్న చిత్రాలకు మంచి జరుగుతుందని రామకృష్ణ గౌడ్ చెప్పారు. ఈ రోజు టీఎఫ్ సీసీ కార్యాలయంలో తమ అసోసియేషన్ సభ్యులతో కలిసి రామకృష్ణ గౌడ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో*టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్ర పరిశ్రమలోని లొసుగులు తెలుసు. అందుకే పెద్ద సినిమాలకు బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపు రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరుపున స్వాగిస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల చిన్న చిత్రాలకు మంచి జరుగుతుంది. పెద్ద సినిమాలకు వేలాది రూపాయల టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్ వైపు ప్రేక్షకులు రాని పరిస్థితి ఏర్పడుతోంది. దీని వల్ల చిన్న చిత్రాలు థియేట్రికల్ గా నష్టపోతున్నాయి. ఏడాదికి రిలీజయ్యే చిత్రాల్లో 90 శాతం చిన్న చిత్రాలే. కేవలం 10శాతమే పెద్ద చిత్రాలు ఉంటున్నాయి. పుష్ప 2 సినిమాకు 200 టికెట్ రేట్ పెంచుకోమని ప్రభుత్వం చెబితే 3 వేల వరకు టికెట్ రేట్స్ పెంచుకున్నారు. దీని వల్ల రేవతి అనే మహిళ కుటుంబం 12 వేలు ఖర్చు చేసి పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లింది. అక్కడ థియేటర్ లో తొక్కిసలాటలో చనిపోయింది. వారి అబ్బాయి శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇలాంటి దుర్ఘటన జరిగినా అల్లు అర్జున్ మానవత్వంతో స్పందించలేదు. నిన్న పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూశాం. ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు నిర్మాతలు, హీరో అల్లు అర్జున్ ఎలాంటి సాయం చేయలేదు. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పోలీసులదే తప్పు అని చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్ అక్కడ రోడ్ షో, ర్యాలీ చేసింది వీడియోలో క్లియర్ గా ఉంది. ఎవరో వద్దంటే నేను శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లలేదు అని అల్లు అర్జున్ చెప్పడం కరెక్ట్ కాదు. చిన్న చిత్రాలకు డిజిటల్ రేట్స్ విషయంలో యూఎఫ్ వో క్యూబ్ ధరలు అధికంగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1500 ఉంటే మన దగ్గర 10 వేలు వారానికి వసూలు చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారిని మా టీఎఫ్ సీసీ తరుపున కలవబోతున్నాం. ఈ విషయంలో సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.*టీఎఫ్ సీసీ సెక్రటరీ జేవీఆర్ మాట్లాడుతూ* – ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎవరికైనా చట్టపరంగా శిక్ష తప్పదనే సంకేతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ద్వారా తెలియజేశారు. ఇకపై బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపు ఉండదని గట్టగా చెప్పారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇక పుష్ప 2 సినిమా కథలోనే యువతకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అంశాలున్నాయి. అది దేశభక్తి సినిమా కాదు, తెలంగాణ నేపథ్య సినిమా కాదు, ఎర్రచందనం దొంగతనం చేసి ఎలా జాతి సంపద దోపిడి చేయాలనే కాన్సెప్ట్ తో వచ్చింది. ఇలాంటి చిత్రాలను ప్రజలు ప్రోత్సహించవద్దు అన్నారు.*టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ మాట్లాడుతూ* – పుష్ప2 బెన్ ఫిట్ షో సందర్భంగా రేవతి అనే సోదరి చనిపోవడం బాధాకరం. వారి అబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఘటన మా అందరినీ చాలా బాధపెట్టింది. ఇంత జరిగినా మా సినిమా ప్రమోషన్ ఆగిపోయింది అనే కోణంలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతుండటం సరికాదు. టీఎఫ్ సీసీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి గారు ఏం చెప్పారో అలాగే చిన్న చిత్రాలకు ఆదరణ దక్కేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. పెద్ద సినిమాలకు బెన్ ఫిట్ షోస్ రద్దు, టికెట్ రేట్ల పెంపు రద్దు వల్ల మా లాంటి చిన్న హీరోలకు మంచి జరుగుతుంది, కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బాగుపడతారు అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎఫ్ సీసీ వైస్ ప్రెసిడెంట్ అల్లా బక్షు, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రవి, ఈసీ మెంబర్ రాజశేఖర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు