​నూతన అధికారులకు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మర్యాదపూర్వక సత్కారం…
పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందించాలి…
​తిరుపతి ఆగష్టు 4.

టీటీడీలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రాన్స్‌పోర్ట్ జనరల్ మేనేజర్ పి. రాము, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, ఎస్ఎంఓ డాక్టర్ రవి శంకర్ కుమార్, తిరుపతి కేటరింగ్ ఆఫీసర్ విజయ్ భాస్కర్, అలాగే టీటీడీ ఈహెచ్ఎఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రాంతి కుమార్ లతో అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
​ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, పరిపాలనలో మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అధికారుల పదవీకాలం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకున్నట్లు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్, తెలిపారు. నూతన అధికారుల ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవ్వడమే కాకుండా సంస్థ అభివృద్ధి వేగవంతం కాగలదని చీర్ల కిరణ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, కోశాధికారి గుంటూరు రేఖ, సభ్యులు చిన్నంగారి సూరిబాబు, అశోక్ కుమార్, పార్థసారథి, వెంకటనాగులు, రవి, హర్ష, యోగేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *