మన ధ్యాస ప్రతినిధి కూర్మన్నపాలెం సెప్టెంబర్ 18: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని వినాయకుని దర్శించుకుని పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఏకలవ్య యూత్ పెద్దలు యొక్క వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడమే కాక అన్న సమారాధన నిర్వహించడం అద్భుతం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇల్లపురాము,జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపప్పు దామోదర్,అప్పిని సన్యాసిరావు, ప్రగడ రాము, నాగరాజు,ఎస్ పాపారావు,దాసరి అప్పారావు , దాసరి అప్పుడు,ఏకలవ్య యూత్ సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *