రేణిగుంట ఎన్టీఆర్ కూడలిలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల సందడిలో అట్టహాసంగా నిర్వహించారు.జన్మదిన వేడుకల సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు, టీడీపీ యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి, అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు పంచిపెట్టి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా సుమారు 3 వేల మందికి మాంసాహార విందు ఏర్పాటు చేసి పంపిణీ చేశారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాలర్స్ దివాకర్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలతో రేణిగుంట ఎన్టీఆర్ కూడలి జన్మదిన వేడుకలకు వేదికగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *