నెల్లూరులో సందడి చేసిన కథానాయిక పాయల్ రాజ్ పుత్.నెల్లూరు. జూలై 21 ప్రముఖ యువ కథానాయిక పాయల్ రాజ్ పుత్ నెల్లూరులో అభిమానుల కులహాలు మధ్య సందడి చేశారు. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గరుడ వెంచర్ కు సంబంధించిన బ్రోచర్ను యువ కథానాయిక రాజ్ పుత్ చేతుల మీదుగా లాంచనంగా ఆవిష్కరించారు. నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు, మాగుంట లేఔట్ ప్రాంతంలో ఉన్న చెరుకుపల్లి పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో “సన్ రైజ్ జయభేరి-2026” ఈ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కథానాయిక రాజ్ పుత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్స్ వ్యాపార లావాదేవీలు సాగిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా 16 ప్రాజెక్టులను ఘనవిజయంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో తొలి వెంచర్ను గూడూరు ప్రాంతంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. తుడా అనుమతులతో సుమారు 50 ఎకరాలలో “గరుడ ఎంక్లేవ్” వెంచర్ ను నెల్లూరు, గూడూరు ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సంకల్పం కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సన్ రైజ్ ఇన్ఫ్ రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్ పి.అంజిరెడ్డి మాట్లాడుతూ 2016లో ప్రారంభించబడిన సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ లో 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 15 వేల మందిపై చిలుకు అసోసియేట్ ప్రతినిధులుగా పనిచేస్తున్నారని చెప్పుటకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వ్యాపార అభివృద్ధి సాధిస్తున్న సన్రైజ్ ఇన్ఫ్రా నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిందని,గూడూరు పట్టణంలో నెల్లూరు–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న మెగా ప్రాజెక్ట్‌ను సన్‌రైజ్ ఇన్‌ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన బ్రోచర్ను కథానాయిక పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. నెల్లూరు జిల్లాలో ప్రాజెక్ట్ ప్రారంభమైన 2 నెలల్లోనే వినియోగదారులు, మార్కెటింగ్ అసోసియేట్ల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. వెంచర్లో ఉన్న మొత్తం 650 ప్లాట్లలో ఇప్పటికే 60 ప్లాట్లు విక్రయించామని ఈ సందర్భంగా వెల్లడించారు.రానున్న రోజుల్లో నెల్లూరు, నాయుడుపేట, ఓజిలి, తడ, సూళ్లూరుపేట, శ్రీసిటీ, తిరుపతి ప్రాంతాల్లో కూడా సన్‌రైజ్ ఇన్‌ఫ్రా ప్రాపర్టీస్ శాఖలను విస్తరించి, పారిశ్రామిక కారిడార్ పరిధిలో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ప్రీమియం ప్లాట్లను అందించడమే తమ లక్ష్యమని అంజి రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తమ సంస్థ ఎదుగుదలకు అండగా నిలిచిన నెల్లూరు ప్రజలకు, మార్కెటింగ్ అసోసియేట్లకు, వ్యాపార భాగస్వాములకు, సన్‌రైజ్ కుటుంబ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మరియు నెల్లూరు డైరెక్టర్ జి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుధీర్, మహేష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శివారెడ్డి, లక్క పతి, కార్తీక్, రవీంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు ఆళ్ల శివన్న, కదిరి శ్రీనివాసరావు, యు శ్రీనివాస కుమార్, వి శ్రీనివాస్ రెడ్డి, దేవకుమార్ రెడ్డి తదితరులతోపాటు రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు, మార్కెటింగ్ అసోసియేట్లు, కంపెనీ ప్రతినిధులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *