నెల్లూరు, జూలై 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెరుకూరి హేమంత్ రాయల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం అందించడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది” అన్నారు.కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.వారి సేవా స్ఫూర్తి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. అదే స్ఫూర్తితో మేము కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాం అని పేర్కొన్నారు.అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భోజనం స్వీకరించారు. కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలు, దాతలు, యువత, మీడియా ప్రతినిధులకు హేమంత్ రాయల్ కృతజ్ఞతలు తెలిపారు.చివరగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చెరుకూరి సునంద, చింతంరెడ్డి శిరీష రెడ్డి, అమంచర్ల కుసుమ, ముజఫర్, పనికి జీవన్, ముడూరి కార్తీక్, రాపూరు ధర్మేంద్ర, సమీర్, సాయి తదితరులు పాల్గొనారు.
