కె.వి.బి. పురం,మన ధ్యాస, జూలై 15: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కె.వి.బి. పురంలో బుధవారం తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సత్యవేడు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.నియోజకవర్గ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తన స్వంత నియోజకవర్గమైన సత్యవేడులో పార్టీ కార్యక్రమాల కోసం పనిచేస్తున్నానని, ఎలాంటి పదవుల కోసం రాలేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని, ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు.మండల అధ్యక్షుడు మునస్వామి యాదవ్ మాట్లాడుతూ, కె.వి.బి. పురం మండల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, మండలంలోని అన్ని పంచాయతీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ నాయుడు, క్లస్టర్–4 ఇన్చార్జి దొరబాబు నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి లోకేష్ చౌదరి, బ్రాహ్మణపల్లి ఆయకట్టు చైర్మన్ సురేంద్ర బాబు, యూనిట్ ఇన్చార్జిలు రాజా రెడ్డి, ప్రకాష్ యాదవ్, వాసు నాయుడు, సుకుమార్, సురేష్, మస్తాన్, శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు హరి యాదవ్, అఖిల్, మునికృష్ణ, హరికృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.