ఉదయగి జూన్ 26, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..
నాగ్‌పూర్ లో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ ని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు,ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు నాగ్‌పూర్‌లోని ఆయన నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా రోడ్లు, జాతీయ రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు కేంద్ర నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేయగా, సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
