కొమ్మి గ్రామ హరిజనవాడలో శనివారం నుంచి సోమవారం వరకు జరగబోయే సీతాలమ్మ బొడ్డు రాయి ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు అధినేత వెంకటాద్రి నాయుడు, ట్రస్టు సభ్యులు చెరుకూరి నవీన్ లకు ఆహ్వానం..

కొండాపురం, జూన్ 26, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కొండాపురం మండలం కొమ్మి గ్రామ హరిజనవాడలో శనివారం నుండి సోమవారం వరకు సీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ట జరిగే ఈ కార్యక్రమనికి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రినాయుడు ని, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ ,సింధు ప్రియ లను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు .అనంతరం ట్రస్ట్ చైర్మన్ వెంకటాద్రి నాయుడు స్పందించి శీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ట కార్యక్రమానికి ట్రస్ట్ తరుపున 15000 వేల రూపాయలు విరాళం అందించారు.అదేవిదంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా గ్రామానికి ఉండాలని గ్రామస్తులు రైతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వారు జీవించాలని ఆయన కోరారు. శీతాలమ్మ అమ్మ వారి ఆశీస్సులు ఉంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చెరుకూరు శేషయ్య, చెరుకూరి వెంకప నాయుడు , దేవినేని చౌదరి, అంబటి శ్రీను,మెడికల్ మధు , కొమ్మి గ్రామ మాజీ సర్పంచ్ యారం చెన్నయ్య, హరిజనవాడ నాయకులు ,ఆలయ నిర్మాణ సభ్యులు డీలర్ శ్రీను,బండ్లమూడి మల్లికార్జున, వెంకటేశ్వర్లు, యువత , తదితరులు పాల్గొన్నారు.
