కలిగిరి జూన్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలిగి స్టేషన్ పరిధిలో శనివారం ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్న వారిపై బహిరంగ ప్రదేశాల మద్యం సేవిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఉంచి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ జలీల్ తెలిపారు. స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 29 మద్యం బాటిల్లును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి సంబంధిత కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ జలీల్ మాట్లాడుతూ గ్రామాల్లో అనాధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహించడం మద్యం దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించడం కల్తీ మద్యం విక్రయించడం వంటి చర్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలు బహిరంగ మద్యపానం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ఎక్సైజ్ శాఖ నిరంతరం తనిఖీలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలింపు లేదా బెల్ట్ షాపులు ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన 9440902523 నెంబర్ కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోపియంగా ఉంచుతామని బెల్టు షాపులను ప్రోత్సహించే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *