కలిగిరి జూన్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సిఐ సర్కిల్ కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు సిఐ పి సుబ్బారావు పూల గుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పి వివి రమణ కుమార్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు పూల గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన అన్నారు. నూతన సర్కిల్ కార్యాలయం ప్రారంభంతో ప్రజలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు,కావలి డిఎస్పి వివి రమణ కుమార్, సిఐ పి సుబ్బారావు, కలిగిరి ఎస్సై ఉమాశంకర్, పోలిస్ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.