జలదంకి, జూన్ 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
జలదంకి లో జరిగిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకనికి సంబంధించిన మెగా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తూ ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదని టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పారు. రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తొలి విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన “నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం”కు నిదర్శనమని పేర్కొన్న బొల్లినేని వెంకట రామారావు ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ రాబోయే మూడేళ్లలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ విడతలో ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.5,000, పీఎం కిసాన్ కింద రూ.2,000 చొప్పున మొత్తం రూ.7,000 జమ అయ్యిందన్నారు. నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు రూ.117.16 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో45275 మంది రైతులకు రూ. 30 కోట్ల ఐదు లక్షల 20వేల రూపాయలు లబ్ధి చేకూరిందని ఆయన వెల్లడించారు.