

మన న్యూస్:పాచిపెంట డిసెంబర్18 పార్వతీపురం మంజూరు జిల్లాపాచిపెంట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులకు. ఐదు నెలలకు పైగా ఉన్న వేతన బకాయలు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాచి పెంట మండలం కర్రివలస స్కూల్లో మధ్యాహ్నం భోజన కార్మికులు.బి రాములమ్మ,ఈ సరస్వతి సింహాచలం లతోపాటు సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నెల ఐదో తేదీలోపు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలి అనే నిబంధన ఉన్న.అలా చేయలేదని ఐదు నెలలుగా చాలీచాలని వేతనాలు వచ్చిన 3000 రూపాయల కూడా సక్రమంగా ఇవ్వకపోవడం తీవ్రమైన కష్టాలకు ఇబ్బందులకు గురవుతున్నారని పిల్లలకు వేడివేడి అన్నం వండి పెట్టి ఎంతో శ్రమ పడిన వంటములు పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మానుకోవాలని.ఇప్పటికైనా వేతనాలు పెంచాలని అలాగే సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించకుండా ప్రభుత్వ హయాంలో నడపాలని ప్రభుత్వ రంగ సంస్థలు అయినా విద్యారంగాన్ని బలోపేతం కోసం కృషి చేయాలని ఎన్నో ఏళ్లుగా పిల్లలకు కష్టపడి వండిపెట్టిన వంటములు పట్ల నిర్లక్ష్యం మానుకొని వారికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని ప్రతి నెల వేతనాలు ఐదో తేదీ లోపు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్చే శారు.భవిష్యత్తు పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత పడాలని అన్నారు.