తిరుపతి జూన్ 3.
తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ తదితర ప్రాంతాల్లో గత 50 సంవత్సరాలుగా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారుల ప్రతినిధి బృందం ఈ రోజు తుడా కార్యాలయంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, సుమారు 30 మందికి పైగా వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు.
దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు సవివరంగా తెలియజేశారు.
తమ సమస్యలను పరిశీలించి, వాటికి తగిన పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

