తుడా అధికారులకు, కేపీసీ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు…
క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తుడా ఛైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు…
తిరుపతి జూన్ 3.
తిరుపతి నగరానికే తలమానికంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “తుడా టవర్స్” పనుల్లో జాప్యం చోటుచేసుకోకూడదని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి , వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు స్పష్టం చేశారు.పనుల వేగం పెంచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని వారు అధికారులను, కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.తుడా టవర్స్ నిర్మాణ పురోగతిపై నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కేపీసీ సంస్థ ప్రతినిధులు, తుడా ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వారు ఇరువురు తుడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మొన్నటి దినం తుడా టవర్స్ నిర్మాణ ప్రాంతాన్ని ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో ఆయన ప్రతి అంతస్తులో జరుగుతున్న పనుల తీరును నిశితంగా గమనించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగం, ఇంకా పూర్తి కావాల్సిన పనుల శాతంపై ప్రాథమిక అంచనాకు వచ్చిన ఆయన పనుల్లో మరింత వేగం పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించి తక్షణమే ఈ ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:పనుల్లో వేగం పెంచేందుకు కేపీసీ సంస్థ అదనపు కార్మికులను,అవసరమైన యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులు ముందుకు సాగాలని, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, నివేదికలు సమర్పించాలని తెలిపారు.వేగంగా పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం కూడా అంతే ముఖ్యమని,ఉపయోగించే సామగ్రి విషయంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని,ఎక్కడా ఏమాత్రం రాజీ పడకూడదని తెలియజేశారు.వైస్ చైర్మన్ ఆర్ గోవింద రావు మాట్లాడుతూ:తుడా టవర్స్ నిర్మాణం పూర్తయితే నగర రూపురేఖలు మరింత మెరుగుపడటమే కాకుండా, సంస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఉద్ఘాటించారు. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు, తుడా ఇంజనీరింగ్ అధికారులకు మధ్య సమన్వయం లోపించకూడదని,ఏవైనా సాంకేతిక లేదా పరిపాలనాపరమైన సమస్యలు ఎదురైతే,తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకోవాలని తెలిపారు.ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు ఎస్ ఈ రవీంద్రయ్య సీపిఓ దేవికుమారి భూసేకరణ అధికారి సుజన ఏపీఓలు జేపీఓలు,తుడా అధికారులు,కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

