మన ధ్యాస, నెల్లూరు,జూలై 20 : నెల్లూరు నగరం, ఆర్టీసీ ఎదురుగా, సర్వోదయ కాంప్లెక్స్ లో న్యూ సంజీవిని జనరిక్స్ అండ్ సర్జికల్స్ షాపును సోమవారం నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి ప్రారంభించినారు.ముందుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని షాప్ యజమాని గుణపాటి పెంచల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. కాటంరెడ్డి గిరిధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి షాప్ ను ప్రారంభించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….. నెల్లూరు నగరంలో న్యూ సంజీవని జనరిక్స్ అండ్ సర్జికల్స్ షాపు ఇది నాలుగవ బ్రాంచి. ప్రారంభానికి రావడం నాకు సంతోషంగా ఉంది.ఈరోజుల్లో జనరల్ మెడిసిన్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ జనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ ధరలకు వస్తున్నాయి అని తెలిపారు. గుణ పాటి పెంచల్ రెడ్డి మరెన్నో బ్రాంచ్ లు పెట్టాలని, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, పిండి సురేష్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *