తవణంపల్లి జూన్ 1 మన ద్యాస
తవణంపల్లి మండలం చారాల హరిజనవాడకు చెందిన యువతి కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి విక్కిని మత్యం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలియజేశారు. ఆయన కథనం మేరకు సుమారు నాలుగు సంవత్సరాలుగా విక్కీ ,కావ్య ప్రేమించుకుంటున్నారని.. గత ఆరు నెలలుగా విక్కీనీ కావ్య వివాహం చేసుకోమని అడిగితే మాట దాటవేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిపారు. ఈనెల 30వ తేదీన కావ్య విక్కిని గట్టిగా పెళ్లి చేసుకోమని నిలదీయగా, ఆమెను పెళ్లి చేసుకోనని దిక్కు ఉన్నచోట చెప్పుకో అని లేదా చచ్చిపో అని చెప్పడంతో మనస్థాపo చెందిన కావ్య ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందింది అన్నారు. ఆమె మరణించడానికి ప్రేరేపించినందున ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితు విక్కిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.