

మన న్యూస్:ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి డిమాండ్ తుర్కయంజాల్.తేలంగాణ విద్యా శాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు వారం రోజులుగా చేపట్టిన దీక్ష శిబిరాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జిల్లా సమితి బృందం సందర్శించి,సంఘీభావం తెలియజేసారు. అనంతరం ఉద్యోగులు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ను రాష్ట్ర ప్రభుత్వానికి నివేధించాలని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్,జిల్లా అధ్యక్షులు మధు సంయుక్తంగా మాట్లాడుతూ ద్వీతీయ శ్రేణి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.గత 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ హయాంలో నాటి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీని ఇప్పుడు విస్మరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల,జిల్లా స్థాయిలో సిస్టం అనలిస్ట్, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్లు, డేటా ఎంట్రీ,క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, పార్ట్ టైం ఇన్స్ట్రుక్టర్స్, స్పెషల్ ఆఫీసర్స్,అటెండెర్స్, తదితర వివిధ విభాగాలలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారని,రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పనిచేస్తున్నారన్నారు.వీరందరూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నా,ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తంచేశారు.అదే విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత తో కూడిన పే స్కేల్ ఇవ్వాలని,ప్రభుత్వ విద్యాశాఖ నియామకాలలో స్థిరత్వాన్ని కల్పించాలనే డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం అలసత్వం వహించడం సిగ్గు చేటు అన్నారు.విద్యా శాఖను గాడిలో పెట్టాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విద్య శాఖ ఉద్యోగుల పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిధిలో గత వారం రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ఉద్యోగులకు పరోక్ష మద్దతు ఇవ్వాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి,సమ్మె చేస్తున్న సమగ్ర ఆయా శాఖల ఉద్యోగులు కాకుండా వేరే ఇతర ప్రైవేట్ ఉద్యోగులతో శాఖ పనులు చేయించాలని నిర్ణయిస్తున్నారని,ఈ డీఈఓ చర్యలను ఏ ఐ వై ఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఉదాసీనత కనబర్చాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత, నాయకులు సాయి, ఆర్ లక్ష్మి, పద్మ ,జ్యోతి, శ్రీనివాస్ రెడ్డి,మల్లేష్, ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా నాయకులు గణేష్,వీరేశ్,భగత్సిం గ్,మోహన్,భాను ప్రకాష్, యాకయ్య,శ్రావణ్, చిరంజీవి,సైదులు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.