
మన న్యూస్, చిత్తూరు:-చిత్తూరులో రోడ్డు విస్తరణ జరగాల్సిందే.హైరోడ్డు రోడ్డు విస్తరణకు కలిసి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా అనిఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారుచిత్తూరు సమగ్రాభివృద్ధిపై ఆత్మీయ సమావేశం విజయవంతం చేశారుఇకపైప్రతి మూడు నెలలకు ఓసారి సమావేశాలు నిర్వహిస్తా ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తీసుకొని చిత్తూరుని అభివృద్ధి చేస్తానని అన్నారుచిత్తూరు నగర అభివృద్ధి కోరుకునే వాళ్లు, ఆశపడే వాళ్లంతా కలిసి రావాలని, రోడ్ల విస్తరణ.. మౌలిక సదుపాయాలు కల్పనతోనే చిత్తూరు నగరం సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు నగరాన్ని స్మార్ట్ గా అభివృద్ధి చేయడం, రోడ్ల విస్తరణ అంశాలపై సోమవారం సాయంత్రం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ప్రజా సంఘాలు, నగర అభివృద్ధి కమిటీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధ్యక్షతన జరిగినది ఈసమావేశంలో చిత్తూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయడం అనే అంశాలపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు. యువత, విద్యార్థులు మాట్లాడుతూ.. చిత్తూరు నగరాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయాలని, యూనివర్సిటీ నెలకొల్పడం ద్వారా విద్యా అవకాశాలను మరింత మెరుగుపరచాలని కోరారు. వైద్యరంగం, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, ఐటీ కంపెనీల ఏర్పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.. నగరంలో రోడ్ల విస్తరణ అంశం గత పది సంవత్సరాలుగా నానుతుందని.. రోడ్లు అభివృద్ధి చెందితేనే నగరం అభివృద్ధి చెందుతుందని.. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధానంగా హై రోడ్డు విస్తరణ అంశంలో కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని.. అయినా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. హైరోడ్ విస్తరణ కోసం అందరూ కలిసి వచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే.. విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని.. విస్తరణలో నష్టపోయే వారికి తగిన విధంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఉన్న చిత్తూరు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని.. అయితే కొంత నష్టమైన ఇప్పుడు అందరూ కలిసికట్టుగా చిత్తూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కలిసి రావాలన్నారు. మురుకంబట్టి నుంచి కలెక్టరేట్ వరకు, పుత్తూరు రోడ్డు వరకు రోడ్లను విస్తరించుకోవడం ద్వారా నగరాన్ని వేగంగా అభివృద్ధి వైపు నడపగలమని చెప్పారు. చిత్తూరు నగర అభివృద్ధి కోసం స్మార్ట్ చిత్తూర్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి కోసం కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. నాడుb ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై నమ్మకంతో అమరావతి రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. నేడు ఇదే రాజధాని ప్రాంతాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో చిత్తూరు ప్రజలు చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, చుడా చైర్ పర్సన్ కె.హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజహసింహులు, మాజీ ఎమ్మెల్యే ఎఎస్ మనోహర్, సహాయ కమిషనర్ ఎ ప్రసాద్, నగర ప్రముఖులు డీకే బద్రి నారాయణ, రావూరి ఈశ్వరరావు, వి. సురేంద్ర కుమార్, చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, చల్లూరు ద్వారకనాథ్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, కవిత, సప్తగిరి ప్రసాద్, శోభారాణి, గంటా మోహన్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, కాలనీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
