ఎల్ బి నగర్ :- మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భక్తి భావంతో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి , హయత్‌నగర్ డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు చెన్నగోని శ్రీధర్ గౌడ్ , భాస్కర్ సాగర్ దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *