Oplus_0


ఎల్లారెడ్డి, మే 8 (మన ధ్యాస):
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. కాగా, ఎల్లారెడ్డి ఎస్‌ఐగా పనిచేసిన మహేష్ రాజంపేటకు బదిలీ అయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్‌ఐ రాజు మాట్లాడుతూ, పోలీస్ శాఖపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు. పట్టణంలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *