తవణంపల్లి మనద్యాస ప్రతినిధి మే 04 (నాగరాజ సరకింటి )
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని మాదిగవాడ లో సోమవారం సాయంత్రం గాలి బీభత్సంతో జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ ఆనుకుని ఉన్న 40 ఏళ్ల నాటి పెద్ద మాను పెద్దగా గాలి వీచడంతో మాను వేళ్ళతో పాటు పెకిలించుకుని చెట్టుకు ఆనుకుని ఉన్న మాదిగ వాడలోని కాలనీ ఇండ్ల వైపు కూలడంతో పాటు చెట్టు కొమ్మలు ముర్గయ్య పై పడటంతో గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాక ఒక్క అడుగు ఇటు అటు పడి ఉన్న ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యేవని, ప్రాణం నష్టం కూడా జరిగే ఉండేదని, దీంతోపాటు కరెంటు వైర్లు కూడా తెగి కాలనీ వీధిలో పడటంతో గ్రామస్తులు కూడా చాలా భయ బ్రాంతులు అయ్యారు. మాను విరిగి నేరుగా ఉన్న కాలనీ ఇల్లు మీద కూలి ఉంటే పెద్ద ఎత్తున ప్రమాదమే జరిగి ఉండేది. అలా కాక మాను రెండుగా చీలి పక్కగా ఉన్న ఇంటి పై వాలిపోవడంతో. సగం మాను ఇంటికి ఇంటికి ఐదు అడుగులు సందు మధ్యలో పడడంతో అందులో నివాసం ఉన్న వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు, పెద్ద నష్టమే జరిగి ఉండేది. దీనిపై అధికారులు స్పందించి వెంటనే తగు సహాయక చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.