నెల్లూరు, మన ధ్యాస ప్రతినిధి,మే 3:( విశ్వనాథ సాంబయ్య )నెల్లూరు నగరంలోని కొండయ్యపాలెం భారత్ పెట్రోలియం ఔట్ లెట్ పక్కనే నూతనంగా స్కావా పికిల్ బాల్ అండ్ కేఫ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర , జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, ఎంజి మాల్ ఎండి గోపాలకృష్ణ,రాఘవేంద్ర, తదితరులు హాజరయ్యారు. మహానగరాలకు దీటుగా నెల్లూరు నగరంలో స్కావా పికిల్ బాల్ అండ్ కేఫ్ ను అత్యంత ఆధునాతనంగా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు వీలుగా భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. స్కావా పికిల్ బాల్ కేఫ్ విజయవంతం కావాలని పలువురు అతిథులు ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా స్కావా పికిల్ బాల్ అండ్ కేఫ్ ను ఏర్పాటు చేశామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కావా అధినేత మాగుంట పట్టాభి రామిరెడ్డి, మాగుంట వెంకటనారాయణ రెడ్డి, మాగుంట శరత్ చంద్రారెడ్డి, బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి, మాగుంట ఆదిత్య, ఎంజి మాల్ మల్లి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *