

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం: గత నెల రోజులుగా మూసివేసిన జీడి పిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలని ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు వివిధ ప్రజా సంఘాలు ఆదివారం మద్దతు ప్రకటించారు.ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహిస్తున్న కార్మికులకు వద్దకు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి పద్మ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తమ కార్యకర్తలతో చేరుకుని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికులు గత నెల రోజులుగా పోరాడుతున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. తక్షణమే ఫ్యాక్టరీ తెరిపించి 49 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని,లేనిపక్షంలో పెద్ద ఎత్తున స్కీం వర్కర్లు కార్మికులకు మద్దతుగా రోడ్డుపై కి వస్తారని హెచ్చరించారు. యాజమాన్యం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీని మూసివేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు పార్వతి సిహెచ్ సత్య, కార్మిక నాయకులు ఏ వీరబాబు,చక్రధర్,గోవిందు,ధర్మాజీ, ఆది,కృష్ణారావు,శివ దుర్గాప్రసాద్, రామదుర్గ, జయలక్ష్మి, అన్నపూర్ణ, శివలక్ష్మి, దేవి, చంటి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.