మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట,ఏప్రిల్ 23:– పార్వతీపురం జిల్లా కలెక్టర్,మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలు మేరకు గురువారం నాడు పాచిపెంట,పాంచాలి గ్రామాల్లో భేటీ భాచావో – భేటీ పడవో( బాలకలను రక్షిద్దాం- బాలికలను చదివిద్దాం) అంశం పైన కళాజాత బృందం వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పాచిపెంట ఐ సిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి అనంతలక్ష్మి తెలిపారు.బాలికలు విద్య ఆరోగ్యం, లింగ వివక్షత,బాల్య వివాహాలు వలనవచ్చే అనర్దాలు,చిన్న వయసు లో గర్భం దాల్చడం వలన కలిగే నష్టాలు,బరువు తక్కువ పిల్లలు పుట్టడం, అవయవాలు లోపం,, శరీరక మానసిక అభివృద్ధి తక్కువ గా ఉండటం,రక్తహీనత,ప్రసవ సమయం లో శిశుమరణాలు, మాతృమరణాలు గురించి అవగాహనా కళాజాత బృందం వారిచే అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపెర్వైసర్స్ తదితరులు పాల్గొన్నారు.
