కలిగిరి ఏప్రిల్ 23 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కలిగిరి మండలము రావులకొల్లుగ్రామంలోని గురువారం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల లో ఘనంగా వార్షికోత్సవమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాదిరెడ్డి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా,ఉల్లాసముగా ఆట పాటలతో, సంస్కృతిక కార్యక్రమములతో ఆహుతులను అలరించారు.తదనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఎమ్ సి కమిటీ ఛైర్పర్సన్ చిగురుపాటి అనిత, గ్రామ వైస్ చైర్మన్ పూసాల మాల్యాద్రి నాయుడు,పాఠశాల సహా ఉపాధ్యాయుడు చిలక వెంకట్రావు,అంగన్వాడీ టీచర్ శ్రీమతి పద్మ, మరియు గ్రామములోని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పూసాల శ్రీహరి నాయుడు, పూసాల కొండపనాయుడు,వింజమూరు మదన్, తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, పాఠశాల ఆయాలు చిగురుపాటి గీత, చిగురుపాటి యశోదమ్మ, పాఠశాల సి సి హెచ్ కుమారి చిగురుపాటి మాళవిక, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *