కలిగిరి, మార్చ్ 31 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె ।

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని వెంకన్నపాలెం గ్రామం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ గ్రామపంచాయతీ నిధులు తొమ్మిది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్ ప్రారంభోత్సవ నేమ్ బోర్డు వివాదాస్పదంగా మారింది, అధికారంలో ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్లు తొలగించి కేవలం వైసీపీకి చెందిన జడ్పిటిసి పాలూరి మాల్యాద్రి రెడ్డి, సర్పంచ్ రాగి దివ్య ,ఉప సర్పంచ్ పాలూరి కొండారెడ్డి, జిల్లా చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ,పేర్లు ను మాత్రం ముద్రించడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు, ప్రోటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నేతలు తమ పేర్లతో బోర్డులు పెట్టడంపై ప్రజలు అసహాన వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికారంలో ఉన్నది టిడిపినా వైసీపీ నా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *