బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

కలిగిరి, మార్చ్ 30 మన న్యూస్ ప్రతినిది, నాగరాజు కె

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన బొల్లినేని వెంకటసుబ్బయ్య ఆదివారం స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది.ఈ విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పెద్దపాడు గ్రామానికి చేరుకుని, వెంకటసుబ్బయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంకటసుబ్బయ్య గారి మరణం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *