మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30 : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 20 నెలలుగా ప్రణాళికా బద్ధమైన వ్యూహంతో గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . 11 లక్షలతో సిసి రోడ్డు, 20 లక్షలతో స్మశాన అభివృద్ధి, 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లీనిక్ లకు శంఖుస్థాపనలు చేసేందుకు కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి టిడిపి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… గత ఐదేళ్లలో పల్లెలు అభివృద్ధికి దూరంగా వున్నాయని, పంచాయతీలలో నిధులు లేవు, రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంటుపడ్డ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టామన్నారు. పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించి గ్రామ సర్పంచ్‌లకు గౌరవాన్ని, అధికారాలను తిరిగి కల్పించిందనన్నారు. 20 నెలల కూటమి పాలనలో గుండాలమ్మ పాళెం అభివృద్ధికి 89 లక్షల 18 వేల రూపాయలు కేటాయింపులే అందుకు నిదర్శనం అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి స్థల ధనం చేసి దాతృత్వం చాటుకున్న నాగేంద్ర ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యకరంలో కొడవలూరు మండల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






