కలిగిరి, మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె )

కలిగిరి లోని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో సీతారామ కళ్యాణం మహోత్సవానికి గోటితో ఒలిచిన కోటితలంబ్రాల ను కలిగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించే కలిగిరమ్మ అమ్మవారి దేవాలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కలశాలతో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఊరేగింపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం అయిన అనంతరం భద్రాచలం నుండి మరల స్వామివారి ప్రసాదం వనించిన భక్తులు అందరికీ అందజేయడం జరుగుతున్నది, అని సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి వెంకట రంగారావు, సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ ప్రసాద్ రెడ్డి, నెల్లూరు జిల్లా మహిళా సహ కన్వీనర్ అంజమ్మ,మండల కన్వీనర్ రమాదేవి, సహకన్వీనర్ రాణేమ్మ, చౌడమ్మ, స్రవంతి, జిల్లా ధర్మ ప్రచారక్ కర్ర భాస్కర్, సబ్ డివిజన్ ధర్మ ప్రచారకూసాల మాల్యాద్రి,కార్యక్రమం నిర్వహణ అధ్యక్షులు బాపతి శ్రీనివాస్ రెడ్డి,తదితర భక్తులు భారీ ఎత్తున పాల్గోని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమానికి అన్నదానం కార్యక్రమం నిర్వహించిన మూలే బాలకృష్ణారెడ్డి దంపతుల,కు ఆ భగవంతుని ఆశీస్సులు తో ఎల్లవేళలా వారిని వారి కుటుంబానీకి ఆ భగవంతుని ఆశీస్సులు కలిగి ఉండాలని పలువురు భక్తులు కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *