మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని మొండి బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్‌డీఏ ఏపిడీ విజయలక్ష్మి..స్వయం సహాయక సంఘ సభ్యులను కలిసి ఇంటింటికి వెళ్లి బకాయిలు చెల్లించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..స్వయం సహాయక సంఘాల (SHG) రుణాలు మాఫీ కావని, తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని తెలిపారు. బకాయిలు చెల్లించి ఖాతాలను రెగ్యులర్ చేసుకుంటే ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీ లబ్ధి పొందవచ్చని చెప్పారు. అలాగే ఇందిరా మహిళా శక్తి ద్వారా అందించే వివిధ పథకాల కింద మరిన్ని రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. అందువల్ల మార్చి 15వ తేదీ లోపు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని కొత్త రుణాలు తీసుకోవాలని సంఘ సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బ్యాంకు లింకేజీ డీపీఎం రాజయ్య, ఏపీఎం ప్రసన్న రాణి, సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్,సీసీలు సాయిలు, చీను, గ్రామపంచాయతీ కార్యదర్శి భారతి,కారోబార్ కృష్ణ, వీవో మాజీ అధ్యక్షురాలు సావిత్రి, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *