మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సర్పంచ్ కేతావత్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భారతి తో కలిసి ముగ్గు పోసి ఇందిరమ్మ ఇంటి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునే అందుకోసం కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో 12 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, 8 ఇందిరమ్మ ఇండ్ల పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు విడతల వారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీనా సింగ్ తదితరులున్నారు.