మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు ఏర్పాటు చేశారు. ముందుగా ఎంఈఓ తిరుపతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ…పదవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు అని,క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు.రాబోయే పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు,
వీడ్కోలు పార్టీ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.సీనియర్ల పట్ల ఉన్న అనుబంధాన్ని విద్యార్థులు తమ ప్రసంగాల ద్వారా తెలియజేశారు.
అనంతరం మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ ఇచ్చిన పరీక్ష ప్యాడు, పెన్నులు పెన్సిల్ స్కేలను ఉపాధ్యాయులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల ప్రసాద్,రమేష్ ,గౌస్, సుజాత,అరుంధతి ,రవీందర్ గణేష్ ,రాజు,హరీష్ తదితరులు ఉన్నారు