కలిగిరి,మార్చి 01,మన న్యూస్ ప్రతినిధి), నాగరాజు కె.
కలిగిరి లోని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులుకు కలిగిరి మండల లెవెల్ ప్రతిభా పాఠవ పరీక్ష -2026 ను స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగిరి నందు కలిగిరి మండల అపస్ అధ్యక్షులు శ్రీ అంకినపల్లి మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ ప్రతిభా పాఠవ పరీక్షకు ముఖ్య అతిధిగా నెల్లూరు జిల్లా అపస్ అధ్యక్షులు కె.కె. రాజగోపాలాచార్యులు, ముఖ్యవక్తగా విద్యా భారతి కార్యదర్శి శేషారెడ్డి, విశిష్ట అతిధిగా జిల్లా ఉపాధ్యక్షులు వెంకట రమణారెడ్డి , జిల్లా కార్యదర్శి శ్రీ డి. రాధయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి కె. వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి యు. వెంకట కృష్ణయ్య, మండలములోని అన్నీ ప్రాధమిక, ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ ఉపాధ్యాయనీయులు, 5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ ప్రతిభా పాఠవ పరీక్షలో ప్రధమ స్థానం – ఎం.పి.పి.ఎస్. అనంతపురం సౌత్ విద్యార్థినీ పి. మైథిలి, ద్వితీయ స్థానం ఎం.పి.పి.ఎస్. పరికోట విద్యార్థినీ పి భావన, తృతీయ స్థానం ఎం.పి.పి.ఎస్. గంగిరెడ్డిపాలెం విద్యార్థి ఇ. వరుణ్ తేజ సాధించారు.