జలదంకి, మార్చి 1,(మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె.

జలదంకి మండలంలోని రామవరప్పాడు ఎస్సీ కాలనీకి చెందిన మారుపూడి అన్నమ్మ కుటుంబానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మానవత్వంతో అండగా నిలిచారు. గత కొంతకాలంగా అన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులకు డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న నాయకులు ఆదివారం ఆమె నివాసానికి టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల రామచంద్రయ్య నాయుడు, వర్ధినేని మురళి నాయుడు వెళ్లి పరామర్శించారు.వారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు వర్ధినేని వెంకట వినయ్ కుమార్ చౌదరి తన స్వంత నిధుల నుంచి రూ. 5000 నగదును తక్షణ సహాయం కింద బాధితురాలికి అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం కేవలం రాజకీయ బాధ్యత మాత్రమే కాదని, సామాజిక కర్తవ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో, యువనేత లోకేష్ మార్గదర్శకత్వంలో, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనల మేరకు సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. బాధితురాలికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని పథకాలు అందేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని వారు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సెట్టిపల్లి ప్రసాద్, మరుపూడి నరసయ్య, బత్తల కోటయ్య, బొడ్డు ఆశీర్వాదం, సెట్టిపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *