ఎస్సీ వర్గీకరణ అమరవీరుల త్యాగ ఫలితామే అని అంటున్న విజమూరు ఎమ్మార్పీఎస్ నేతలు.
వింజమూరు,ఫిబ్రవరి 01, (మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె.
ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే
నేడు వింజమూరు టౌన్ లోని స్థానిక బంగ్లాసెంటర్ నందు ఎంఎస్పీ ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జీ గోచిపాతల ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఎంఎస్పీ అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పోల్గొని వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమరుల త్యాగ ఫలితమేనని ఆయన పేర్కొన్నారు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు ఇప్పించారు అనంతరం అమరవీరులకు జ్యోతి ప్రజ్వలన కావించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అతి తక్కువ మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు ప్రధానమంత్రినే కదిలించే విధంగా తయారైందని తెలిపారు అనేక ఒడిదుడికలతో కష్టనష్టాలతో ఉద్యమం ముందుకు సాగి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు కొనసాగిందన్నారు అమరవీరుల త్యాగఫలితంగానే వర్గీకరణ జరిగిందని తెలిపారు ఈ వర్గీకరణతో నేడు డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు పొందగలిగామని అదే విధంగా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం చేపట్టే విధంగా మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ముందుకు సాగి రాజ్యాధికారం చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు మందకృష్ణ మాదిగ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని శిరసావహించేందుకు ఎమ్మార్పీఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉందన్నారు వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులు వారి ఆశీస్సులతో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్రంలోని మాదిగ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఎంతో పుణ్యాత్ములు అన్నారు వారి ఆశయాలను ఆచరించి ఫలింప చేయడమే మన ముందున్న కర్తవమని తెలిపారు వారి ఆశీస్సులు సాధన కోసం భవిష్యత్తులో కూడా ఎంతో ప్రయత్నం చేసి వారి కలలు ఫలించే విధంగా రాజ్యాధికారం చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారాన్ని చేపట్టినట్లయితే అమరవీరులకు ఆత్మ శాంతి కలుగుతుందని ఆయన తెలిపారు ఆ దిశగాఎమ్మార్పీఎస్ ఎప్పుడు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఊటుకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం తిరుమలేశు మాదిగ,గంగపట్ల నాగరాజు మాదిగ,జి వెంగళరావు,ఎ నాగేశ్వరరావు.ఎ వెంకటేష్,కె పెంచలరావు,జి సాయి బి బాలాజీ,జి సంతోష్,సిహెచ్ వెంగళప్రసాద్,ఎ వెంగబాబు,తదితరులు పొల్గన్నారు.
