మన సంస్కృతి కళాబృందంచే కాణిపాకం లో అలరించిన భక్తి పాటలు.
కాణిపాకం ఐరాల ఫిబ్రవరి 28 మన ద్యాస
ఐరాల మండలంలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులు భక్తి పాటలను పాడి వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కళాకారుడు కలకట రెడ్డప్ప మాట్లాడుతూ ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళ దినోత్సవ మాసోస్తవ కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ వారిని గౌరవించడం మా సంస్థ ఆనవాయితీగా కొనసాగుతున్నదని, అందులో భాగంగా శనివారం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మంచి పాటల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులకు, మహిళలకు అవకాశం కల్పించి స్వామి వారి భక్తి పాటలు పాడి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారని తెలిపారు. అలాగే మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మార్చి నెల చివరి వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అవార్డు సంస్థ అధ్యక్షులు రవి , విశ్రాంత ఉపాధ్యాయులు పూల మనోహర్, వెంకటేష్ నాయుడు, విజయలక్ష్మి రాధా ఉమా, ఉష, కళాకారులు తదితరులు