బంగారుపాళ్యం, మన ధ్యాస,ఫిబ్రవరి 28. రిపోర్టర్ కమల్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలనలో మార్చి నెల ఒకటో తేదీ ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేది శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఫించన్లు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని తుంబపాలెం గ్రామంలో అవ్వ, తాతలకు వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ సర్పంచ్ ఉషశ్రీ, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అభిరామ్, బూత్ ఇన్చార్జి గురుస్వామి యాదవ్, ప్రభుత్వ సిబ్బంది, చందు తదితరులు పాల్గొన్నారు.