ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో ముమ్మరంగా సాగుతున్న సంక్షేమ వివరణ..పాల్గొన్న మండల కన్వీనర్ పూసాల వెంగప నాయుడు, ప్రధాన కార్యదర్శి కే. కొండలరావు.

కలిగిరి జులై 28 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో “రెండేళ్ల పాలన – ఇంటింటి ప్రచారం” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాo లో పాల్గొన్న కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు,పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కొండలరావు నేతృత్వంలో కూటమి నాయకులు, lకార్యకర్తలు కాలనీలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పూసాల వెంగప నాయుడుమాట్లాడుతూ,,ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో ఉదయగిరి నియోజకవర్గ మెట్ట ప్రాంతాల అభివృద్ధికి,ముఖ్యంగా నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ ప్రచారంలో భాగంగా లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు.తెల్లపాడు పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను, ప్రజలకు చేకూరిన లబ్ధిని ఆయన కరపత్రాల ద్వారా వివరించారు.అర్హత ఉండి ఇంకా పథకాలు అందని వారికి అందేలా చూడడమే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొప్పులు కొండలరావు,కూటమి కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *