మన ధ్యాస, నిజాంసాగర్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి వార్డు సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని శిక్షణ అధికారి మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నాలుగో రోజు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో వార్డు సభ్యులు చురుకుగా పాల్గొని గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. గ్రామాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మురికి ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని తెలిపారు.ప్రజలు భోజనం చేసే ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సేవలను గుర్తించి సర్పంచ్‌తో కలిసి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని వార్డు సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఓటీలు వెంకట్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.