బంగారుపాల్యం,మనధ్యాస ఫిబ్రవరి 5 రిపోర్టర్:కమల్ రెడ్డి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాల్యం మండలం ,తగ్గువారిపల్లి పంచాయతీ ,పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం 06-2- 2026 నుండి 8- 2- 2026 వరకు మహా కుంభాభిషేకం జరుగునట్లు ఆలయ ధర్మకర్తలు, కార్యనిర్వాహకులు తెలిపారు.ఈ నెల 6వ తేదీ గణపతి, లక్ష్మి, నవగ్రహ హోమం, పూర్ణాహుతి, మంగళహారతి సాయంత్రం గణపతి పూజ నూతన విగ్రహ గ్రామోత్సవం,శాంతి హోమం, పూర్ణాహుతి, దీపారాధన,7వ తేదీ శనివారం గణపతి పూజ, రుద్రహోమం నూతన విగ్రహ ధన్యది వాసవం, క్షీరాభిషేకం, దీపారాధన, సాయంత్రం గణపతి పూజ నూతన విగ్రహదివాసం, యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన హోమం జరుగును.8వ తారీకున ఉదయం 5 గంటలకి గణపతి పూజ,మహాదీపారాధన,మహా కుంభాభిషేకం, గోపూజ, మంగళహారతిజరుగును. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడును. కావున భక్తాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప కటాక్షములను పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించగలరని ధర్మకర్తలు, కార్య నిర్వాహకులు, కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *