రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ అభివృద్ధికి దూరంగా ఉందని, పూర్తిగా వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్న ప్రజలకు సాగు అందించేదుకు సహకరించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నేటి విడుదల చేసిన అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..నిజాంసాగర్ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గం లో ఉన్నప్పటికీ కేవలం 3600 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని తెలిపారు. లెండి,నాగమడుగు నీటితో రైతులకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. నాగమడుగు , లెండి పెండింగ్ ప్రాజెక్టులకు నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం తో ఆయకట్టు ముంపు భూములను తగ్గించి పనులు త్వరగా పూర్తిచేయాలని వేడుకోన్నారు. కౌలాస్ నాల ప్రాజెక్టు కూడా పుడికతో నిండిపోయిందని, పూడిక , మరమత్తు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. జుక్కల్ ప్రజలకు, రైతులకు కొత్త జీవితం అందించాలని అన్నారు.అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించేదుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయం అని అన్నారు. తెలంగాణలో మొదటగా నాటు వేసి వరి పంటలు వేస్తారు..వడగండ్ల వాన పడకముందే వరి పంటలు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. రెండు పంటలకు గాను నీరు పుష్కలంగా ఉందని అన్నారు.1.30 వేల ఎకరాలకు సాగు నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా అందుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటిది నిజాంసాగర్ ప్రాజెక్టు అని తెలిపారు. లెండి ప్రాజెక్టు గత 20 ఏండ్లుగా పెండింగ్ లో ఉందని త్వరగా పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేయాలనీ కోరారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గ వరి సాగులో ముందు ఉందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని రైతులకు పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఆరు దఫాలుగా నీటిని రైతులకు పొదుపుగా వాడుకొని వడగళ్ల వాన పడకముందే వరి కోతలు కోసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావు,మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రిస్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటి పారుదల శాఖ అధికారులు అనిల్, శ్రీనివాస్,సోలేమన్,పిట్లం ఏఎంసి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,,ప్రజా పండరి,లోక్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి