
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : సుదీర్ఘకాలంగా స్థానిక తూర్పు కాపు/గాజుల కాపు కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్లను ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లలో తూర్పు కాపు యువతకు ఉద్యోగ రిజర్వేషన్లు పోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తూర్పు కాపులు న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వాలు మారడం రిజర్వేషన్స్ సౌకర్యాలు కలగకపోడం షరా మామూలే అయిపోయింది. ఈ నేపథ్యంలో తూర్పు కాపు విద్యా వైజ్ఞానిక అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో న్యాయస్థానాల్లో సుదీర్ఘ పోరాటం చేసశారు. చిట్ట చివరకు నేడు తూర్పు కాపు / గాజుల కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ ప్రాతినిధ్యం తో కుల ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధిచిన ప్రభుత్వం జారీచేసిన జీవోను ఏలేశ్వరం మండల తాహశీల్దార్ కె కుసరాజుకు సంఘ నాయకులు వినతి పత్రంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు తో పాటు స్థానిక నాయకులు శిడగం వెంకటేశ్వరరావు ,పైల సుభాష్ చంద్రబోస్, అలమండ చలమయ్య, సుంకర రాంబాబు, బంక కోదండరాం, బంక రాజు, కోరాడ ప్రసాద్, పైల విజయ్, తురోతు శ్రీనివాస్, దనేడు చిన్న, శిడగం రామకృష్ణ, రెడ్డి రాజా, దత్తి రామకృష్ణ, బూర్ల సత్తిబాబు, సామంతుల తమ్మా రావు తదితర నాయకులు, సంఘస్తులు పాల్గొన్నారు.