శ్రద్ధా శ్రీనాథ్ “కలియుగమ్ 2064’’ జనవరిలో విడుదల !!!

Mana News;- ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064’’ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా జనవరిలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగమ్ ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది. తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల విడుదల చేశారు. “వినూత్న కథాంశంతో రాబోతున్న ”కలియుగమ్ 2064″ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మణిరత్నం తెలిపారు. తెలుగులో హీరో నాని తో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఇప్పటి జెనరేషన్ కి చాలా అవసరమని , ఇది యువత ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని , ఈ మూవీని అందరూ చూసి , మా ఈ క్రొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నామని, ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేబడ్డాయి, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు నటీనటులు: శ్రద్ధా శ్రీనాధ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు సాంకేతిక నిపుణులు: బ్యానర్ :ఆర్. కె. ఇంటర్నేషనల్ Producer :కె. యస్. రామకృష్ణ రచన & దర్శకత్వం :ప్రమోద్ సుందర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :కె. రామ్ చరణ్. ఎడిటర్ :నిమల్, సంగీత దర్శకుడు :డాన్ విన్సెంట్, ఆర్ట్ డైరెక్టర్ :శక్తి వెంకట్రాజు, సౌండ్ డిజైన్: తపస్ నాయక్

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు