కొండాపురం,జనవరి 14,మన న్యూస్,(నాగరాజు కె ).

కొండాపురం మండలం లోని గత మూడు సంవత్సరాలుగా కోడె చారిటబుల్ ట్రస్ట్ పేదలకి అండగా ఉంటుందని, సుమారు 60 మంది ముస్లిం సోదరులకు పిండి వంటలు పంపిణీ చేశామని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు మరియు చెరుకూరి నవీన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.ముస్లిం కుటుంబ సభ్యులు షేక్ ప్యారాబి భర్త షేక్ మస్తాన్ ఈమధ్య అనారోగ్యానికి గురైన సంగతి తెలుసుకొని ట్రస్టు తరుపున 5000/- ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకారం , బిజెపి కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, యువమోర్చా జిల్లా నాయకులు సాయి కృష్ణ మరియు మాజీ సర్పంచులు చెరుకూరు రమణయ్య, నర్రవుల వెంకటేశ్వర్లు,గుంటూరు యెన ,టిడిపి నాయకులు తిమొతి దేవినేని వెంకటసుబ్బయ్య, చెరుకూరు శేషయ్య, షేక్ కాసిం కాజా మస్తాన్ మరియు కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *