మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: శ్రీ స్వామి వివేకానంద 168 వ జయంతి,జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామ సచివాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు కొల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకానంద బోధనలు అనుసరించాలని, భారత దేశ సంస్కృతిని చికాగో సర్వమత సమ్మేళనం లో చాటి చెప్పిన మహనీయుడని, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు,వజ్ర సంకల్పంతో ఉన్న యువత ఈ దేశానికి చాలా అవసరమని చెప్పిన ఆదర్శ పురుషుడు నరేంద్రుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు,ఎన్డీయే కూటమి నాయకులు ధనేకుల వీర భద్రరావు, సొసైటీ డైరెక్టర్ అదృష్ట దేవుడు, ఆత్మ కమిటీ డైరెక్టర్ వనుం మంగ,వెలుగురి హరేరామ,సాగి బంగార్రాజు, అచ్చే వీరబాబు,బచ్చల శివ,దొడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *